ఈ.ఎం.డీ.పీ. ప్రాజెక్టు ప్రదర్శనలో రాష్ట్రస్థాయికి రెండు ప్రాజెక్టులు ఎంపిక
ప్రజాశక్తి-కడియం : విద్యార్థులు టివి, పారిశ్రామిక, ఆర్థిక అక్షరాస్యతపై వారికి ఏ మేరకు అవగాహన కలిగిందో తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రధమ్ సంస్థ సంయుక్తంగా 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు (ఈ.ఎం.డీ.పీ.) ఎంటర్ ప్రెన్యూరియల్ మైండ్ సెట్ డెవలప్మెంట్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని, జిల్లా సైన్స్ అధికారి జీ.వీ.యన్.శ్రీనివాస్ నెహ్రూ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల స్థాయిలో నిర్వహించిన కార్యక్రమాల ద్వారా మండల స్థాయికి, తదుపరి జిల్లా స్థాయికి ఎంపికైన ప్రాజెక్టులు 18.03.2023 న బొమ్మూరు డైట్ శిక్షణ కళాశాలలో ప్రాజెక్ట్ ఎక్స్-పో 2023 ప్రదర్శనకు ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలో 'ధవళేశ్వరం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థుల ప్రాజెక్ట్' మరియు 'కడియం మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దుళ్ళ విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్ట్' రెండూ రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యాయని తెలిపారు. ఈ నెలాఖరున జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో మన జిల్లా తరుపున వీరు పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో ఈ.ఎం.డీ.పీ. జిల్లా మేనేజర్ ఉదయ్ కుమార్, డైట్ ప్రిన్సిపాల్ ఎన్.ఆర్. సుబ్రహ్మణ్యం, సూర్యనారాయణ, సమగ్ర శిక్షా ఎ.ఎం.ఓ గౌరీ శంకర్, సి.ఎం.ఓ శ్రీనివాస్, ఎం.ఐ.ఎస్ & ప్లానింగ్ కోఆర్డినేటర్ నరసింహారెడ్డి, తదితరులు పాల్గొన్నారు










