ప్రజాశక్తి - ఉండ్రాజవరం : శనివారం వెలువడిన 10వ తరగతి పరీక్ష ఫలితాలలో మండల విద్యార్థులు 55.47 శాతం మంది ఉత్తీర్ణులైనట్లు మండల విద్యాశాఖ అధికారి పి వి ఎస్ నాగరాజు తెలిపారు. మండలంలోని 8 ఉన్నత పాఠశాలలకు గాను, మొత్తం 548 మంది విద్యార్థులు పరీక్షలు వ్రాయగా 304 మంది ఉత్తీర్ణులయ్యారు. సూర్యారావుపాలెం గ్రామానికి చెందిన అంబటి మాధురి 576 మార్కులతో ప్రభుత్వ పాఠశాలలో మండలంలో మొదటి స్థానం సాధించినట్లు తెలిపారు. తిట్ల సలోమి, కాజా జ్యోతి లు 572 మార్కులతో ద్వితీయ స్థానం, మాదిరెడ్డి వెంకటేష్, ఎం డి బి శిరీష లు 568 మార్కులతో తృతీయ స్థానం సాధించినట్లు ఆయన తెలిపారు. బాలురు 125 మంది, బాలికలు 179 మంది పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థినీ, విద్యార్థులు, అధ్యాపకులను విద్యాశాఖ అధికారి అభినందించారు.










