Jun 16,2023 15:39

ప్రజాశక్తి - ఉండ్రాజవరం(తూగో) : ఉండ్రాజవరం ప్రాధమిక ఆరోగ్యకేంద్రంలో మూడవ శుక్రవారం స్పెషలిస్ట్ డాక్టర్లు వైద్య సేవలలో బాగంగా  గైనకాలజిస్ట్ డాక్టర్ మృదుల ప్రసూతి స్త్రీల వైద్య నిపుణులు, ఊపిరితిత్తుల స్పెషలిస్ట్  డాక్టర్ మేరీ వసంతలు ఓపి సేవలు అందించారని ఉండ్రాజవరం పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ ఆర్ ప్రసాద్ తెలిపారు. గైనిక్ సేవలో బాగంగా 24 మందిని, ఊపిరితిత్తులకు సంబంధించి 5 గురిని పరీక్షించి, తగిన వైద్య సేవలు అందించారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి శనివారం ఎముకల స్పెషలిస్ట్ జితేంద్ర శ్రీ ఫణి తేజ అందించే సేవలను అవసరమైన వారు వినియోగించుకోవాలని కోరారు.