Mar 22,2023 15:38

ప్రజాశక్తి-రాజానగరం : ఆరు పదుల వయసులో సుమారు 170 జంటలు షష్ఠి పూర్తి మహోత్సవం ఘనంగా జరిగింది. వేదమంత్రాలు మంగళవాయిద్యాలు మధ్య  ఉగాది రోజున జరిగిన  తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మాధవి కళ్యాణం మండపంలో నిర్వహించారు. స్థానిక ఆర్య వైశ్య సంఘం నాయకులు ఆధ్వర్యంలో రాష్ట్రంలోని కృష్ణా, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, తెనాలి, నెల్లూరు తదితర జిల్లాల నుండి ఒక రోజు ముందు బంధువుల, తెలిసివారి ఇంటిలో దేనిలో పాల్గొన్నారు. షష్ఠి పూర్తి చేసుకుంటున్న జంటలు కొడుకు కోడళ్ళు మనుమలు మనుమరాళు బంధువును  ఆశీర్వదిoచారు.  మండల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన మడవిల్లి వెంకన్నబాబు సహకారం జరిగిన ఈ కార్యక్రమంలో వినాయక గీతం శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ కుప్పా విశ్వనాథ శర్మ చదివారు. దీనికి ముందు మంగళ స్నానం, వివాహం తర్వాత సత్యనారాయణ మూర్తి వ్రతం తో ముగించారు. అనంతరం షష్ఠి పూర్తి చేసుకున్న జంటతో పాటువారి బంధువులకు 5వేల మందికిపైగా భోజనం ఏర్పాటు చేశారు. సాయంత్రం జంటలను సన్మానించారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకర్షించాయి. మండల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా మండవిల్లి వెంకన్న బాబు, కార్యదర్శిగా  సుబ్బారావు, నూతన కమిటీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు వెంకన్న బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుండి 170 జంటలుపైగా వచ్చి షష్ఠి పూర్తి చేసుకున్న చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దయ వలన సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. నూతన కమిటీ కి సభ్యులకు కృతజ్ఞతలు చెప్పారు.