ప్రజాశక్తి-చాగల్లు : రాష్ట్రస్థాయి జావిలిన్ త్రో పోటీల్లో చాగల్లు మండలం కలవలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి మట్ట శ్రీనివాస్ ఎంపికైనట్లు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు జొన్నకోటి వెంకట శ్రీనివాస్ తెలిపారు. ఈనెల21.22. 23 తేదీల్లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరులో జరిగే రాష్ట్ర పోటీల్లో శ్రీనివాస్ ఎంపికైనట్లు ఆయన తెలిపారు. ఇటీవల జరిగిన అండర్ 18 విభాగం జావలిన్ త్రో పోటీల్లో సిల్వర్ మెటల్ సాధించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మట్ట్టట వెంకట్రావు గ్రామపద్దలు ఎస్ ఎం సి చైర్మన్ సభ్యులు పాఠశాల ఉపాధ్యాయులు. కోచింగ్ ఇచ్చిన వ్యాయామ ఉపాధ్యాయులు కోయ గంగాధరరావును అభినందించారు










