Mar 25,2023 15:02

ప్రజాశక్తి - ఉండ్రాజవరం : తమ పాఠశాలకు చెందిన ఎనిమిదవ తరగతి విద్యార్థిని, పాఠశాల పేరెంట్స్ కమిటీ చైర్మన్ బయ్యే సత్తిపండు కుమార్తె బయ్యే  నాగలక్ష్మి ఎన్ ఎం. ఎం ఎస్ స్కాలర్షిప్ కు ఎంపికైనట్లు వడ్లూరు జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయిని వీ ఏ సత్యవాణి  తెలిపారు. శనివారం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థిని ప్రధానోపాధ్యాయిని అభినందిస్తూ, జాతీయస్థాయి పరీక్షకు నాగలక్ష్మి అర్హత సాధించి, స్కాలర్షిప్ కు ఎంపిక కావడం పట్ల  హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆర్ తేజస్వి, సొసైటీ అధ్యక్షులు కటారి సిద్ధార్థ రాజు, పాఠశాల పేరెంట్స్ కమిటీ చైర్మన్ బయ్యే సత్తిపండు, వేండ్ర రమేష్, రఘుమండ శ్రీను, నాగరాజు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఈ విజయానికి కారణమైన ప్రధానోపాధ్యాయిని, ఉపాధ్యాయులను సత్తిపండు,  గ్రామ ప్రజలు ప్రత్యేకంగా కొనియాడారు.