Mar 23,2023 13:07

ప్రజాశక్తి-రాజానగరం : ఈ నెల 25వ తేదీన ఆదికవి నన్నయ యూనివర్సిటీ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ విభాగం ఆధ్వర్యంలో  మేనేజ్మెంట్ ఫెస్ “సవిస్కార 2కె23” విజయవంతం చేయాలని వీసీ ఆచార్య జి.వి.ఆర్.ప్రసాదరాజు అన్నారు. దేనికి సంబందించిన బ్రోచర్ ను వీసీ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా విసి మాట్లాడుతూ సవిస్కార 2కె 23 పేరుతో నిర్వహిస్తున్న ఫెస్ట్ ఉమ్మడి గోదావరి జిల్లాల్లోని మేనేజ్మెంట్ విద్యార్థులంతా హాజకావల్లన్నారు. విద్యార్థుల్లోని కమ్యూనికేషన్ స్కిల్స్, ఆర్గనైజింగ్ స్కిల్స్, డెసిషన్ మేకింగ్ వంటి నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి ఇది ఉపయోగపడుతుందన్నారు. దేనిలో రిజిస్ట్రార్ ఆచార్య టి.అశోక్, ప్రిన్సిపాల్ ఆచార్య ఎస్.టేకి, డాక్టర్.ఎన్.ఉదయభాస్కర్, డాక్టర్ పి.ఉమమహేశ్వరిదేవి, డాక్టర్ జి.రాజేంద్రప్రసాద్, డాక్టర్ ఎ.శ్రీపద్మవల్లి, డాక్టర్ జి.అలీస్ జాయ్, డాక్టర్ ఎం.రమేష్, డాక్టర్ ఎం.అమ్మిరెడ్డి, డాక్టర్ జె.రవిశంకర్, డాక్టర్ ఐ.సత్యనారాయణరాజు, ఎం.జోహర్ కృష్ణ కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.