ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
జెఎఎస్, రీ సర్వే ఫేజ్ -3 , హౌసింగ్‌లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సవరించిన లక్ష్యాలకు అనుగుణంగా స్టేజ్ కన్వర్షన్‌పై కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం జరిగిందని జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ తెలిపారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్ జవహర్ రెడ్డి విజయవాడ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్‌లతో రెవెన్యూ రీ సర్వే, జాతీయ రహదారులు, వ్యవసాయం, డైరీ అభివద్ధి, చిరు ధాన్యాలు, జగనన్న ఆరోగ్య సురక్ష, పిఆర్‌లో ప్రాధాన్యత భవనాలు, ఉపాధిహామీ, స్వమిత్వ, జేకేసిలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి జెసితోపాటు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇందుకు సంబంధించి జిల్లాలో భూముల రీ సర్వేకి చెందిన ఫేజ్ -2లో 54 గ్రామాల్లో ఫైనల్ ఆర్‌ఒఆర్, కరెక్షన్ మాడ్యుల్ పూర్తి చేసినట్లు జెసి వివరించారు. సరిహద్దు రాళ్ళు ఏర్పాటుకి చెందిన 53,552 లక్ష్యాలను వంద శాతం సాధించడం జరిగిందన్నారు. ఫేజ్ -2కు చెందిన 22 (ఏ) లేయార్ మాడ్యుల్ పనులు పురోగతిలో ఉన్నట్లు తెలిపారు. ఫేజ్ -3కి చెంది 90 గ్రామాల్లో రీ సర్వే పనులకు గానూ గత 15 రోజులకు చెందిన 10 గ్రామాలకు చెందిన లక్ష్యాలకు గాను 13 గ్రామాల్లో పూర్తి చేశామన్నారు. వ్యవసాయ రంగంకు సంబంధించి ఈ కేవైసికి చెందిన పంటల, రైతుల వివరాలకు జాబితా ప్రకటన మార్గదర్శకాల ప్రకారం సెప్టెంబర్ 30 నాటికి పంట నమోదు పూర్తి చేసి సామాజిక తనిఖీ కోసం ఆర్‌బికెల వద్ద అక్టోబర్ 5 నుంచి 10 వరకు ప్రదర్శి స్తామని తెలిపారు. మల్టీ పర్పస్ గోడౌన్ నిర్మాణాలకు సంబంధించి మొత్తం 77 భవనాలకు గాను 56 చోట్ల స్థలాలు గుర్తించి అందించామని,గత వారంలో 4 చోట్ల స్థలాలు గుర్తించినట్లు వివరించారు. హౌసింగ్‌కి చెంది మార్పు చేసిన లక్ష్యాల మేరకు 19,253 ఇళ్ళ నిర్మాణాలు కు గాను స్టేజ్ కన్వర్షన్‌లో 14,372 ఉన్నాయని, బేస్మెంట్ స్థాయికి ముందు 36,767 ఉన్నాయని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు, ఎస్‌ఈ ఎస్‌బివి ప్రసాద్, సిపిఓ ఏ. ముఖ లింగం, వ్యవసాయ అధికారి ఎస్. మాధవరావు, డ్వామా పిడి పి. జగదాంబ, పిడి డిఆర్‌డిఎ ఎస్. సుభాషిణి, హౌసింగ్ అధికారి జి. పరశురాం, డిపిఒ జెేవి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.










