Apr 02,2023 22:49

నివాళులర్పిస్తున్న ఎంఎల్‌ఎ గోరంట్ల బుచ్చియ్యచౌదరి

ప్రజాశక్తి- కడియం
మండలంలోని మాధవరాయుడు పాలేనికి చెందిన టిడిపి సీనియర్‌ నాయకులు, ప్రముఖ రైతు అన్నందేవుల సూర్యప్రకాష్‌కు రాజమహేంద్రవరం రూరల్‌ ఎంఎల్‌ఎ గోరంట్ల బుచ్చియ్యచౌదరి ఘనంగా నివాళులర్పించారు. సూర్యప్రకాష్‌ ఆదివారం ఉదయం గుండెపోటుతో ఆకస్మికంగా మరణించారు. విషయం తెలుసుకున్న ఎంఎల్‌ఎ గోరంట్ల మాధవరాయుడు పాలెం చేరుకొని సూర్యప్రకాష్‌ మతదేహాన్ని సందర్శించారు. పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే సర్పంచ్‌ అన్నందేవుల చంటి, టిడిపి మండల అధ్యక్షులు వెలుగుబంటి నాని, నాయకులు అన్నందేవుల సుబ్బారాయుడు, అన్నందేవుల వీరాస్వామి, సంగీత వెంకటేశ్వరరావు, అన్నందేవుల నారాయణరావు, సుధాకరరావు, సురేష్‌, బాబి తదితరులు నివాళులర్పించారు.