ప్రజాశక్తి-రాజమహేంద్రవరం జిల్లా పరిధిలో మహిళల, పిల్లల సమగ్ర ఆరోగ్య పరిరక్షణకు తగు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కె.మాధవీలత తెలిపారు. గురువారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్.జవహర్‌రెడ్డి సుస్థిర అభివద్ధి లక్ష్యాలు, పౌర సేవలు, జిజిఎంపి పనులు, మహిళా స్త్రీ సంక్షేమం తదితర అంశాలపై అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్ నుంచికలెక్టర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రగతిపై కలెక్టర్ మాధవీలత వివరాలు తెలియజేశారు. అంగన్వాడీ కార్యకర్తలు పోస్టులు 13, అంగన్వాడీ సహాయకుల పోస్టులు 14 ఖాళీలు ఉన్నాయని తెలిపారు. వాటి భర్తీకి చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో 8,571 పైగా గర్భిణులు ఉండగా వారిలో రక్త హీనత గల 1,645 మందిని గుర్తించినట్టు చెప్పారు. వారిలో ప్రభుత్వ పరంగా సేవలు పొందేందుకు 1,634 మంది సంసిద్ధత వ్యక్తం చేశారన్నారు. కొద్దిపాటి లక్షణాలు ఉన్నవారు 1,429, మధ్యస్థ లక్షణాలు ఉన్నవారు 216 మంది ఉన్నట్టు పేర్కొన్నారు. తక్కువ బరువు ఉన్న పిల్లలు 3,281 మంది, కుంగి పోయిన వారు 5,570 మంది ఉండగా వారిలో 6,776 మందికి వైయస్‌ఆర్ ప్రత్యేక పౌష్టి కాహరం అందిస్తున్నట్లు తెలిపారు. పెన్షన్ కానుక కింద 566 దరఖాస్తులు, ఇంటి స్థలం కోసం 20, రేషన్ కార్డులు కోసం 1,789, సమీకత ధ్రువపత్రాలు కోసం 2,112, ఆదాయ ధృవపత్రాలకు 1,488, మ్యూటేషన్ కోసం 786 దరఖాస్తులు పరిశీలన దశలో ఉన్నట్లు పేర్కొన్నారు. జిజిఎంపి కింద 1,071 సమస్యలు గుర్తించగలిగితే వాటిలో 1,030కి సంబంధించి పరిపాలన ఆమోదం ఇచ్చినట్టు తెలిపారు. 6వ విడత జగనన్న తోడు కింద పట్టణ పరిధిలో 4,369, గ్రామీణ ప్రాంతాల్లో 1,9078 మంది లబ్ధిదారుల లక్ష్యం దిశగా కార్యాచరణ అమలు చేస్తున్నట్టు మాధవీలత తెలిపారు. జిల్లాలో 77 ఆధార్ నమోదు కేంద్రాల్లో 58 ఆధార్ నవీకరణ చేపట్టినట్టు చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సిపిఒ కె.ప్రకాశరావు, డిఎంహెచ్‌ఒ డాక్టర్ కె.వేంకటేశ్వరరావు, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి కె.జ్యోతి, డిఎల్‌డిఒ పి.వీణా దేవి, వి.శాంతమణి, ఆర్‌డబ్ల్యుఎస్ బాల శంకర్ రావు, ఆరోగ్య శ్రీ కో ఆర్డినేటర్ డాక్టర్ పి.ప్రియాంక, డిప్యూటీ డిఎంహెచ్‌ఒ డాక్టర్ వసుంధర పాల్గొన్నారు.










