ప్రజాశక్తి-రాజమహేంద్రవరం ఈ నెల 27, 28 తేదీల్లో వేమగిరిలో జరగనున్న తెలుగుదేశం పార్టీ మహానాడు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే మహానాడును విజయవంతం చేసేందుకు పార్టీ అధిష్టానం వివిధ కమిటీలను నియమించింది. పార్టీ నాయకులు తమ బాధ్యతలను వేగవంతంగా నిర్వర్తిస్తూ ఏర్పాట్లను చకచకా చేస్తున్నారు. వేమగిరిలోని మహానాడు సభాస్థలి వద్ద పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. అక్కడ జరుగుతున్న పనులను గుడా మాజీ చైర్మన్, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కష్ణ శనివారం పరిశీలించారు. పనులు ఏ మేరకు వచ్చాయో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహానాడు ఈ ప్రాంతంలో జరగడం టిడిపి కుటుంబ సభ్యులకు రెట్టింపు ఉత్సాహాన్ని ఇచ్చిందన్నారు. కాశి నవీన్ కుమార్, మజ్జి రాంబాబు, మోకా ఆనంద్ సాగర్, నిమ్మలపూడి గోవింద్, కుడుపూడి సత్తిబాబు, లంక శ్రీను, సంసాని ప్రసాద్ పాల్గొన్నారు. మహానాడు ప్రాంగణాన్ని టిడిపి రాష్ట్ర లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు రాచపల్లి ప్రసాద్, కార్యనిర్వాహక కార్యదర్శి కనక లింగేశ్వరరావు, నాయకులు నామా సత్యనారాయణ పరిశీలించారు. నాయకులు కొమ్మర్తి బాబ్జి, సిహెచ్.శ్రీను, ఎం.చంద్రమౌళి, ఎం.బాబ్జి, రాయల జయదేవ్, రేవతి, రమేష్, చెల్లుబోయిన శ్రీనివాస్ పాల్గొన్నారు.










