May 22,2023 23:19

ప్రజాశక్తి - కడియం
కడియపులంక సర్పంచ్‌ మార్గాని అమ్మాణి మృతికి పలువురు సంతాపం తెలిపారు. ఆదివారం రాత్రి ఆమె గుండెపోటుతో మృతి చెందిన విషయం విధితమే. జనసేన పార్టీకి చెందిన ఆమె కడియం జడ్‌పిటిసిగా గెలుపొందారు. జనసేన నుంచి రాష్ట్రంలో గెలిచిన ఏకైక జడ్‌పిటిసిగా ఆమె గుర్తింపు పొందారు. అయితే సర్పంచ్‌గా కొనసాగాలని భావించడంతో ఆమె జడ్‌పిటిసి పదవికి రాజీనామా చేశారు. ఆమె భర్త ఏడుకొండలు రాజకీయంగా అందరికీ సుపరిచితులు. అమ్మాణి గతంలో టిడిపి ఎంపిటిసిగా కూడా పనిచేవారు. సర్పంచ్‌ మతితో గ్రామంలో విషాదం అలముకుంది. ఆమె ఆకస్మిక మతి పట్ల రాష్ట్ర గ్రీనింగ్‌ అండ్‌ బ్యూటిఫికేషన్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌, చందన నాగేశ్వర్‌ సంతాపం వ్యక్తం చేశారు. పార్టీలకతీతంగా కడియపులంక గ్రామాభివృద్ధికి అమ్మాణీ చేసిన సేవలను కొనియాడారు. ఆమె మృతి బాధాకరమన్నారు. ఆమె భర్త ఏడుకొండలకు సానుభూతిని తెలిపారు. అలాగే జేగురుపాడు సర్పంచ్‌ యాదల సతీష్‌చంద్రస్టాలిన్‌, వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గిరజాల బాబు, రాష్ట్ర దేవాంగ సంక్షేమ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ దొంతంశెట్టి వీరభద్రయ్య, వీరవరం సర్పంచ్‌ బత్తుల నలిని, దుళ్ల సర్పంచ్‌ కొండపల్లి పట్టియ్య, మాజీ సర్పంచ్‌ డాక్టర్‌ వెలుగుబంటి వెంకటాచలం, సొసైటీ చైర్మను ్లఈదర దీన్‌దయాల్‌, తిరుమలశెట్టి శ్రీనివాసు, వెలుగుబంటి అచ్యుత రామ్‌, రాష్ట్ర శాప్‌ డైరెక్టర్‌ భీమిరెడ్డి నాగేంద్ర, కడియం మండల జెసిఎస్‌ కన్వీనర్‌ తాడాల చక్రవర్తి, కడియం మండల వ్యవసాయ సలహా కమిటీ అధ్యక్షులు ఈలి గోపాలం తదితరులు అమ్మాణీ మృతికి సంతానం తెలిపారు.