ప్రజాశక్తి - కడియం
మండలంలోని బుర్రిలంకకు చెందిన సప్తగిరి నర్సరీ రైతు కుప్పాల దుర్గారావు అరుదైన తియ్యని దుంప పంటను సాగు చేస్తున్నారు. ఈ దుంపలు నారింజ, పసుపు, బీట్ రూట్ రంగుల్లో లభిస్తున్నాయి. చిలకడ దుంప జాతికి చెందిన ఇవి అధిక పోషకాలు కలిగి ఉంటాయని, వివిధ రకాల విటమిన్లు కలిగి ఉండడం వల్ల ఆరోగ్యానికి శక్తినిస్తాయని ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు. రెండేళ్ల క్రితం థాయిలాండ్ నుంచి ఈ మొక్కలను దిగుమతి చేసుకున్నామని రైతు దుర్గారావు తెలిపారు. 90 నుంచి 120 రోజుల్లో కాపునిస్తాయని, ఒక్కో మొక్క రూ.50 నుంచి రూ.70 రేటులో అందుబాటులో ఉన్నాయన్నారు.










