ప్రజాశక్తి-రాజమహేంద్రవరం
ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో 28 దరఖాస్తులు వచ్చాయని రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ కె.దినేష్ కుమార్ అన్నారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ ప్రజలు నుంచి స్పందన అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ కె.దినేష్ కుమార్ మాట్లాడుతూ స్పందన కార్యక్రమంలో వచ్చిన సమస్యలు త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అర్హత ఉండి సంక్షేమ పథకాలు అమలు కానీ వారిని జగనన్న సురక్ష ద్వారా గుర్తించి ఆ పథకాలు అమలు చేయడం జరుగుతోందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకుంటామన్నారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న పారిశుధ్య కార్మికులు యం.నాగు, యం. సోమాలమ్మ, మాకు 3 నెలలు బట్టి జీతాలు లేవు. మాకు పని వత్తిడి కూడా బాగా ఎక్కువగా ఉందని తెలియజేయగా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ .దినేష్ కుమార్ వెంటనే స్పందించి ప్రతీ నెల జీతం వచ్చే విధంగా చూడాలని సంబధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమినర్ పియం. సత్యవేణి, డిప్యూటి కమిషనరు జి.సాంబశివరావు, సిటీ ప్లానర్ వైబీఆర్ చంద్రబోస్, సూపరింటెండెంట్ ఇంజనీరు జి. పాండు రంగారావు, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ ఎ.వినూత్న మరియు ఇతర మునిసిపల్ అధికారులు పాల్గొన్నారు.










