ప్రజాశక్తి-రాజమహేంద్రవరం స్పందన వేదికగా వివిధ సమస్యలపై ప్రజల నుంచి స్వీకరిస్తున్న అర్జీలను అర్హత మేరకు నాణ్యతతో కూడిన విధంగా పూర్తి స్థాయిలో నిర్ణీత కాల వ్యవధిలోనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను జాయింట్ కలెక్టరు ఎన్.తేజ్ భరత్, డిఆర్‌ఒ జి.నరసింహులతో కలసి అర్జీలను కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొత్తం 122 అర్జీలు రాగా ఆన్ లైన్‌లో 106, ఆఫ్ లైన్‌లో 16 అర్జీలు వచ్చాయన్నారు. అర్హత ఉండి సంక్షేమ కార్యక్రమాల ప్రయోజనం, సేవలు పొందని వారిని గుర్తించి ఆమేరకు వారి సమస్యలు పరిష్కారం కోసం పని చేయాల్సి ఉంటుందన్నారు. ఇందులో భాగంగా జగనన్న సురక్ష కార్యక్రమం కింద ఇంటింటి సర్వే నిర్వహించి పథకాల ప్రయోజనం అర్హులకు చేకూర్చుతున్నామన్నారు. స్పందనలో వచ్చిన ప్రతి అర్జీ క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి సమాచారాన్ని నాణ్యతతో కూడిన విధంగా అర్జీదారుడు సంతప్తి చెందే విధంగా పరిష్కరించాలన్నారు. స్పందనలో జిల్లా వ్యాప్తంగా స్పందనలో వచ్చిన ఏ ఒక్క అర్జీ తిరిగి ఓపెన్ కాకుండా పటిష్టవంతంగా నాణ్యతతో కూడిన విధంగా పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ ప్రాంతీయ సంచాలకులు వి.స్వామినాయుడు, డిఎంహెచ్‌ఒ డాక్టర్ కె.వెంకటేశ్వరరావు, సిపిఒ ఎ.ముఖలింగం, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్.మాధవరావు, డిటిఒ ఎన్.సత్యనారాయణ, ఆర్‌టిఒ కెవి.కష్ణారావు, ఎల్‌డిఎం డిబి.ప్రసాద్, జిల్లా హౌసింగ్ అధికారి పి. పరశురామ్, జిల్లా పరిశ్రమల అధికారి. బి.వెంకటేశ్వరరావు, డిఇఒ ఎస్.అబ్రహాం పాల్గొన్నారు.










