ప్రజాశక్తి -దేవరపల్లి
సొసైటీల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని గోపాలపురం ఎంఎల్‌ఎ తలారి వెంకటరావు అన్నారు. ఆదివారం త్యాజంపూడి గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో నూతన పెట్రోల్ బంక్‌ని ప్రారంభించారు. ప్రభుత్వం సొసైటీల ద్వారా అందిస్తున్న సబ్సిడీలు ఎప్పటికప్పుడు రైతులకు తెలియపరిచి ఆ సేవలను వినియోగించుకునేలా సిబ్బంది పనిచేయాలని ఎంఎల్‌ఎ అన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు గన్నమణి వెంకటేశ్వరరావు, ఎఎంసి చైర్మన్ గన్నమనేని జనార్థన్‌రావు, మండల పార్టీ అధ్యక్షు లు కూచిపూడి సతీష్, సీనియర్ నాయకులు నరహరిశెట్టి ప్రసాద్, ఎంపిటిసి సభ్యుడు కాళ్ళ వెంకటరత్నం, కన్వీనర్ కుసులూరి వెంకట సతీష్, నాయకులు పాల్గొన్నారు.










