రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు
ప్రజాశక్తి - గోపాలపురం
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్‌రెడ్డి దేశంలో ఎక్కడ లేని విధంగా పాలనలో అనూహ్య సంస్కరణలను తీసుకొచ్చారని, నాలుగేళ్లలో అర్హతే ప్రామాణికంగా రాష్ట్రంలో రు.2.7లక్షల కోట్లను సంక్షేమ పథకాలకు అందించారని రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ మంతి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఆదివారం గోపాలపురంలో రూ.1.51 కోట్లతో నిర్మించిన తహశీల్దార్ కార్యాలయయం, ఆర్‌బికె, సచివాలయాలను ఆయన ప్రారంభించారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి చెల్లుబోయిన శ్రీనివాసవేణుగోపాలకృష్ణ, ఎంపీ మార్గాని భరత్‌రామ్, కలెక్టర్ కె.మాధవీలత, ఎంఎల్‌ఎలు తలారి వెంకట్రావు, జక్కంపూడి రాజా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సచివాలయం వద్ద నిర్వహించిన సభలో మంత్రి ధర్మాన మాట్లాడారు. నిష్పక్ష పాతంగా పాలన చేస్తూ జగన్ ప్రజల్లో ఆత్మ విశ్వాసాన్ని చూరగొన్నారన్నారు. అర్హులకు నేరుగా ప్రభుత్వ పథకాలు అందుతున్నాయన్నారు. కొన్ని పనులు ఆలస్యమైనప్పటికీ అన్ని అంశాలను గుర్తించి ప్రాధాన్యతా క్రమంలో చేస్తున్నామన్నారు. రెవెన్యూ శాఖలోనూ పలు సంస్కరణు తెస్తున్నామన్నారు. ఇప్పటికే 2 వేల గ్రామాల్లో రీసర్వే ప్రక్రియ పూర్తయ్యిందన్నారు. మే నాటికి డ్రోన్ సర్వే ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. 20 ఏళ్లుగా సాగుచేస్తున్న రైతులకు వారి అర్హతను గుర్తించి భూములను ఇచ్చేందుకు త్వరలో చర్యలు తీసుకునే ఆలోచనలో ఉన్నామన్నారు. ఇన్‌ఛార్జి మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా వాలంటరీ, సచివాలయ వ్యవస్థ ద్వారా నేరుగా సంక్షేమ పథకాలు ప్రజల ఇంటివద్దకే చేరుతున్నాయన్నారు. కలెక్టర్ కె.మాధవీలత మాట్లాడుతూ ప్రభుత్వం పథకాల ప్రయోజనాలను అర్హులందరికీ జవాబుదారీతనంతో అందిస్తున్నామన్నారు. ఎంపీ భరత్ మాట్లాడుతూ పథకాలకు అర్హతే ప్రామాణికంగా ప్రభుత్వం అందిస్తుందన్నారు. రైతు సంక్షేమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. ఎంఎల్‌ఎ తలారి వెంకట్రావు మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నారన్నారు. నియోజక వర్గంలో 20 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న రహదారి అభివృద్ధి పనులు శరవేగంగా జరగుతున్నాయన్నారు. ఆర్‌బికెల ద్వారా భూసార పరీక్షలను రైతుల చెంతకు చేర్చామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి ఉండవల్లి సత్యనారాయణ, జడ్‌పిటిసి సభ్యులు కె.లలిత, కూసం రామ్మోహన్‌రెడ్డి, వెలగా శ్రీరామ్మూర్తి, ఎంపిడిఒ ఆర్.శ్రీదేవి, తహశీల్దార్ రవీంద్రనాథ్, తదితరులు పాల్గొన్నారు.










