Aug 24,2023 00:04

ప్రజాశక్తి-కొవ్వూరు రూరల్‌ రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభ్యున్నతే ధ్యేయంగా జగనన్న ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర హోV్‌ా శాఖ మంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. బుధవారం కొవ్వూరు టౌన్‌లోని 18, 19వ వార్డుల్లో గడప గడపకు మన ప్రభుత్వం 125వ రోజు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు ఏయే స్థాయిలో ఏయే వర్గాలకు చెందుతున్నాయో, ఏమాత్రం చెందుతున్నాయో అనే అంశాలపై హోమ్‌ శాఖ మంత్రి ఆరా తీసి అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలైన నవరత్నాలు తదితర అంశాల్లో ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఆమె తెలిపారు.కొవ్వూరు పట్టణం బాపూజీ నగర్‌లోని ఆనంద లహరి అభ్యసన ఎంపిపి స్కూల్‌ పిల్లలతో మంత్రి కాసేపు ముచ్చటించారు. జగనన్న విద్యాకానుక, అమ్మఒడి తదితర పథకాలను వివరించి పిల్లలు బాగా చదువుకుని మంచి అభివద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఎంతో దఢ సంకల్పంతో రాష్ట్ర అభివద్ధి కోసం ప్రవేశపెట్టిన గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం ప్రజాదరణ పొందుతోందని తెలిపారు. ప్రజా సంక్షేమం కోసమే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ప్రజల్లో జగనన్నపై కలిగిన నమ్మకం, భరోసాతో మా నమ్మకం నువ్వే జగన్‌ అనే నినాదం ప్రజల నుంచి పుట్టుకొచ్చిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల అభివద్ధి కోసం నాడు నేడు, విద్యార్థుల కోసం అమ్మఒడి, జగనన్న విద్యాకానుక, గోరుముద్ద వంటి ఎన్నో కార్యక్రమాలను చేపట్టి విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చా మన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 98 శాతం పైగా నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి అని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకురాగా.. వెంటనే పరిష్కరించాలని సంబందిత అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.