ప్రజాశక్తి- కొవ్వూరు రూరల్
భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలను యథావిధిగా అమలు చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుందర్ బాబు డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక సిఐటియు కార్యాలయంలో భవన నిర్మాణ కార్మిక సంఘం సమావేశం వల్లేపల్లి నరసింహమూర్తి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సుందర ్‌బాబు పాల్గొని మాట్లాడారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిధులను దారి మళ్లించడం తగదన్నారు. కోర్టులు చీవాట్లు పెట్టినా సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. సంక్షేమ బోర్డును నిర్వీర్యం చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. ఏప్రిల్ 5, 6 తేదీల్లో చలో ఢిల్లీకి వస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో మద్దుకూరి దొరయ్య, ఎం.ఆంజనేయులు, ఎస్‌కె.ఆదామ్, వి.సుబ్బారావు, ఆర్.నాగేశ్వరరావు, జె.రాంబాబు పాల్గొన్నారు.










