ప్రజాశక్తి - గోపాలపురం
రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని ఎంఎల్‌ఎ తలారి వెంకట్రావు అన్నారు. మండలంలోని కరగపాడు పంచాయతీ కార్యాలయం వద్ద జగనన్న సురక్ష కార్యక్రమం సర్పంచ్ బొమ్మిన నాగలక్ష్మి ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌ఎ పాల్గొని మాట్లాడారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు అందుతున్నాయన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల లబ్ధి చేకూరుతుందన్నారు. మండలంలో గోపాలపురం- దొండపూడి, చిట్యాల- దుద్దుకూరు రోడ్లు టెండర్లు ప్రక్రియ జరుగుతుందన్నారు. అనంతరం రోడ్డు పనులు మొదలు పెడతారని తెలిపారు. రూ.22.5 కోట్లతో రోడ్లన్నీ పూర్తి చేస్తామన్నారు. మండలంలో 780 దరఖాస్తులు వచ్చాయని వారికి సర్టిఫికెట్లు, కౌలు రైతు కార్డు 112 అందించనున్నట్లు తెలిపారు. నాటుసారపై పలువురు ఎంఎల్‌ఎ దృష్టి తీసుకెళ్లారు. దీని నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన ఫోన్‌లో ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జడ్‌పిటిసి, మండల ప్రత్యేక అధికారి, ఎంపిడిఒ నాయకులు బొమ్మిన నాగరాజు, కురుకూరి నాగేశ్వరరావు, వాసు బోయిన రాంబాబు, అయినపర్తి బంగారయ్య, పిన్నెల్లి సుందర్రావు, వైసిపి నియోజకవర్గ మహిళా అధ్యక్షులు ఎండపల్లి కవిత, సెక్రటరీ రాంబాబు, సర్పంచ్ ఎండపల్లి శేఖర్ బాబు తదితరులు పాల్గొన్నారు.










