May 27,2023 23:21

ప్రజాశక్తి-నిడదవోలు తమ సమస్యలు పరిష్కరించాలని ఎపిజిఇఎ ఆధ్వర్యాన శనివారం నిడదవోలులో నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.శ్రీకాంత్‌ రాజు మాట్లాడారు. నాలుగు రోజులుగా తమ సంఘం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనా కార్యక్రమాలు చేపట్టినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టియినా లేదన్నారు. 1వ తేదీనే జీతాలు చెల్లించాలని, సిపిఎస్‌ రద్దు చేయాలని, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలని, తాము దాచుకున్న నిధులైన జిపిఎఫ్‌, ఎపిజిఎల్‌ఐకు రక్షణ కల్పించాలని, పెన్షనర్లకు రావాల్సిన ఉద్యోగ విరమణ అనంతరం ప్రయోజనాలు తమ ఆర్థిక బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఇకనైనా ప్రభుత్వం తక్షణమే తమను చర్చలకు ఆహ్వానించాలని, తమ డిమాండ్‌లను తక్షణమే పరిష్కరించాలని కోరారు. మండుటెండలో 70 శాఖలకు చెందిన ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, రిటైర్‌ ఉద్యోగులు రోడ్డెక్కి ఆందోళన చేపడుతున్నా ప్రభుత్వం స్పందించక పోవడం సరికాదన్నారు. ప్రభుత్వం ఉద్యోగులను చిన్న చూపు చూస్తోందన్నారు. ఉద్యోగులను ప్రాధాన్యతలోకి తీసుకోవడం లేదన్నారు.