ప్రజాశక్తి -దేవరపల్లి, నల్లజర్ల పలు సమస్యలపై ఎపి స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యాన శనివారం నిరసన చేపట్టారు. పప్పు వెంకట రామారావు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలోకార్యదర్శి బండి సూర్య ప్రకాశరావు మాట్లాడుతూ విశ్రాంత ఉద్యోగులకు మందులు లేకుండా పూటగడవని పరిస్థితి కాబట్టి ప్రభుత్వం ప్రతినెలా ఒకటో తేదీనే పెన్షన్ చెల్లించాలని, జులై 2018 నుంచి ఇవ్వాల్సిన డిఆర్ బకాయిలను వెంటనే చెల్లించాలని, 2020 ఏప్రిల్ నుంచి పిఆర్‌సి బకాయిలను చెల్లించాలని, పెండింగ్‌లో ఉన్న మూడు విడతల డిఆర్ మంజూరు చేయాలని, ఇహెచ్‌ఎస్ కార్డులపై నగదు రహిత వైద్యం అందించాలని, అడిషనల్ క్వాంటం ఇంక్రిమెంట్లు పాత స్లాబ్‌లను పునరుద్ధరించాలని, సర్వీస్ పెన్షనర్ భార్య చనిపోయిన సందర్భంలో ఫ్యూనరల్ చార్జెస్ చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేట్ అధ్యక్షులు సయ్యద్ అలీ కోశాధికారి యలమాటి సత్యనారాయణ, సంయుక్త కార్యదర్శి ఈడుపుగంటి నాగేశ్వరరావు, జిల్లా ఇసి మెంబర్ సుగుణలత, ఎస్.రామారావు, ఈడ్పుగంటి బేబీ సరోజిని, వీరవల్లి శేషుమణి పాల్గొన్నారు. నల్లజర్లలో సంఘం మండల అధ్యక్షులు ఐవి సత్యం మాట్లాడుతూ పెరిగిన ధరలకు అనుగుణంగా ఇవ్వాల్సినకరువు భత్యం, పిఆర్‌సి ఎరియర్స్‌తో పాటు, అనేక ఆర్థిక సమస్యలు తీరక పెన్షనర్స్ ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు, ఎస్‌ఎం.అలీ సాహెబ్. ప్రధాన కార్యదర్శి ఉన్నమట్ల వెంకటేశ్వరరావు, కోశాధికారి ప్రభుదాసు, జాయింట్ సెక్రెటరీ బాలయ్య, వైస్ ప్రెసిడెంట్ కెజెడివి.ప్రసాద్, దత్తు సుబ్రహ్మణ్యేశ్వర రావు, నక్కలపూడి ప్రతాప్ పాల్గొన్నారు.










