Jul 22,2023 00:05

ప్రజాశక్తి- గోకవరం గోకవరం తహశీల్దార్‌ కార్యాలయం వద్ద విఆర్‌ఎలు శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రెవెన్యూ సహాయకులు మాట్లాడుతూ పే స్కేల్‌ అమలు చేయాలని, నామినీలుగా పని చేస్తున్న అందరినీ విఆర్‌ఎలుగా నియమించాలని, అర్హులకు విఆర్‌ఒ, అటెండర్‌, వాచ్‌మెన్‌ ప్రమోషన్లు ఇవ్వాలని, డిఎతో కూడిన వేతనం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. గత ఎన్నికల ముందు వైఎస్‌.జగన్‌ ఇచ్చిన ఏ హామీ నెరవేరలేదన్నారు. సమస్యలు పరిష్క రించాలని అనేకసార్లు అధికారులకు విన్నవించుకునన్నా ఫలితం శూన్యం అన్నారు. వైసిపి ప్రభుత్వం వచ్చాక ఒక్క రూపాయి కూడా పెంచకపోగా ఉన్న డిఎలో కోత విధించారన్నారు. ఆగస్టు 23, 24 తేదీల్లో విజయవాడలో రాష్ట్రస్థాయిలో దీక్షల్లో పాల్గొనాలని పిలుపు ఇచ్చారు.