ప్రజాశక్తి-రాజమహేంద్రవరం ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యాన రాజమహేంద్రవరం రీజనల్ పిఎఫ్ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. సిహెచ్.మోహనరావు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎపిఆర్‌పిఎ కోశాధికారి సిహెచ్.సత్యనారాయణ రాజు, జిల్లా అధ్యక్షుడు సోమేశ్వరరావు, కార్యదర్శి కె.సత్తిరాజు, సిపిఎం నాయకులు పోలిన వెంకటేశ్వర రావు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్‌ఎస్.మూర్తి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రాజులోవ, ఆర్‌టిసి నాయకులు మంగరాజు హాజరయ్యారు. పలువురు నాయకులు మాట్లాడుతూ ఇపిఎఫ్ పెన్షనర్లు అందరికీ ఒకటో తారీఖున పెన్షన్ ఇవ్వాలని, కనీస పెన్షన్ నెలకు రూ.9,000 ఇవ్వాలని, హయ్యర్ పెన్షన్‌కు హయ్యర్ ఆప్షన్ అనుమతించాలని డిమాండ్ చేశారు. మార్చి 19న కాకినాడలో జరిగే రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని పిలుపు ఇచ్చారు. కాకినాడ జిల్లా సబ్ ట్రెజరీ పరిధిలో 2,400 మంది పెన్షనర్లకు పెన్షన్లు జమ చేయకపోవడం దారణమన్నారు. అనంతరం కమినర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పేపర్ మిల్లు యూనియన్ నాయకులు వాసంశెట్టి రాము, బివివి.సత్యనారాయణ, ఎన్.రామకృష్ణ, కోపరేటివ్ బాంక్ నుంచి ఆశపు సోమశేఖర్ పాల్గొన్నారు.










