సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అరుణ్
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
ఎపి పేపరు మిల్లు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, లేకుంటే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి.అరుణ్ హెచ్చరించారు. ఎపి పేపర్ మిల్లు కార్మికులు చేస్తున్న మంగళవారం నాటికి 49వ రోజుకు చేరుకున్నారు. ఈ దీక్షలకు ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. పేపర్ మిల్లు కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లు కోసం, సమస్యల పరిష్కారం కోసం 49 రోజులుగా రిలే నిరాహారదీక్ష చేస్తుంటే యాజమాన్యం పట్టించుకోకపోవడం సిగ్గుచేటు అన్నారు. వెంటనే యాజమాన్యం తన మొండి వైఖరిని వదిలి కార్మికులకు న్యాయం చేయాలన్నారు. లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. గుర్తింపు ఎన్నికలు వెంటనే జరపాలని, క్యాంటీన్ రేట్లను తక్షణమే తగ్గించాలని, కాంట్రాక్టు కార్మికులను సీనియారిటీ ప్రకారం పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న క్వార్టర్స్‌ను బాగుచేయించి తక్షణమే కార్మికులకు ఎలాట్‌మెంట్ చేయాలని, అలవెన్సు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎపి పేపర్ మిల్లు కార్మికుల పోరాటానికి సిఐటియు, జిల్లా కార్మిక సంఘాలు పూర్తి మద్దతు తెలియజేస్తున్నాయని తెలిపారు.










