Jul 12,2023 00:15

ప్రజాశక్తి-యంత్రాంగం
సమస్య పరిష్కారానికే జగనన్న సురక్ష కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని పలువురు ప్రజాప్రతినిధులు అన్నారు. పలు చోట్ల మంగళవారంజగనన్న సురక్ష కార్యక్రమం పలుచోట్ల నిర్వహించారు.
గోకవరం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జగనన్న సురక్ష పథకం కార్యక్రమాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జగ్గంపేట ఎంఎల్‌ఎ జ్యోతుల చంటిబాబు అన్నారు.కొత్తపల్లి గ్రామ సచివాలయంలో మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ జనపరెడ్డి సుబ్బారావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంఎల్‌ఎ చంటి బాబు పాల్గొని మాట్లాడుతూ సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించేందుకు వైసిపి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రతి సచివాలయంలో ప్రత్యేక గ్రామసభలు నిర్వహించడం జరుగుతోందన్నారు. కొత్తపల్లి సచివాలయంలో 1,2లో 2358 ధ్రువపత్రాలను లబ్ధిదారులను అందజేశారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు, ప్రజా ప్రతినిధులు, పలుశాఖ అధికారులు, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తాళ్లపూడి మండలం గజ్జరం గ్రామ సచివాలయం వద్ద సర్పంచ్‌ డాక్టర్‌ గండి రాంబాబు అధ్యక్షతన మంగళవారం జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. 675 మందికి ధ్రువీకరణ పత్రాలను ఎంపిపి జొన్నకూటి పోసిరాజు, సర్పంచ్‌ రాంబాబు, మండల ప్రత్యేక అధికారి సత్యనారాయణ తదితరులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి సత్యనారాయణ, ఎంపిడిఒ వెంకటరమణ, డిటి అహ్మద్‌, కార్యదర్శి హేమంతి, వివిధ శాఖల అధికారులు, ఎంపిటిసి సభ్యులు చిన్నబ్బాయి తదితరులు పాల్గొన్నారు. నిడదవోలు వీక్లీ మార్కెట్‌ దగ్గర ఉన్న సచివాలయంలో జగనన్న సురక్ష ప్రోగ్రాం మున్సిపల్‌ ఛైర్మన్‌ భూపతి ఆదినారాయణ మున్సిపల్‌ చైర్మన్‌ అధ్యక్షతన జరిగింది. ఆయన మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ పథకాలు అందించాలన్నదే వైసిపి ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు. నిడదవోలు పట్టణంలో ఇప్పటికే సుమారు 4,470 వివిధ దవపత్రాలు జారీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఛైర్‌పర్సన్‌ గంగుల వెంకటలక్ష్మి, కౌన్సిలర్లు కామిశెట్టి సత్యనారాయణ, షేక్‌ వజిరుద్దీన్‌, గోపిరెడ్డి శ్రీనివాసు, ఆరుగొల్లు వెంకటేశ్వరరావు, గుర్రం జేమ్స్‌ మున్సిపల్‌ కమిషనర్‌ కేవీ పద్మావతి సచివాలయ సెక్రటరీలు, వార్డు వాలంటీర్లు మరియు పట్టణ ప్రజలు పాల్గొన్నారు. సీతానగరం సీతానగరం గ్రామపంచాయతీ సచివాలయం - 2లో సర్పంచ్‌ కొండ్రపు ముత్యాలు ఆధ్వర్యంలో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తహశీల్దార్‌ సత్యనారాయణ రాజు హాజరయ్యారు. కార్యక్రమం ఉద్దేశించి మండల ఎమ్మార్వో మాట్లాడారు. కార్యక్రమంలో మండల వైసిపి కన్వీనర్‌ గంటా శ్రీనివాసరావు, మండల ఎస్‌సి సెల్‌ మద్దాల కొండలరావు, ఆత్మా కమిటీ చైర్మన్‌ డాక్టర్‌ బాబు తదితరులు పాల్గొన్నారు.