ప్రజాశక్తి-యంత్రాంగం
ప్రజా సమస్యల పరిష్కారానికే జగనన్న సురక్ష కార్యక్రమాన్ని వైసిపి ప్రభుత్వం నిర్వహిస్తోందని ప్రజాప్రతినిధులు అన్నారు. వివరాలుఇవి..
తాళ్లపూడి ప్రజలకు అవసరమైన సేవలు సర్టిఫికెట్లు అందించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న సురక్ష పథకం సక్రమంగా నిర్వహించే బాధ్యత వాలంటీర్లు సచివాలయ సిబ్బంది దేనని హోం శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత అన్నారు. మండలంలోని వేగేశ్వరపురం పోచవరం గ్రామాలలో మంగళవారం జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమానికి మంత్రి వనిత హాజరయ్యారు.. వేగేశ్వరపురం గ్రామంలో ప్రజలకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. మంత్రి మాట్లాడుతూ గ్రామానికి రూ.40 లక్షల రూపాయల ఖర్చుతో విద్యుత్ అభివద్ధి పనులు చేపట్టామన్నారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు రైతులు మాట్లాడుతూ ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దష్టికి తీసుకువచ్చారు. గ్రామ కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ సురక్ష పథకం కింద 519 సమస్యలకి పరిష్కారం చూపుతూ ధ్రువీవీకరణ పత్రాలు అందజేయనన్నట్లు తెలిపారు. పోచవరం గ్రామంలో మంత్రి మాట్లాడుతూ జగనన్న సురక్ష పథకం ఆవశ్యకతను ప్రజలకు వివరిస్తూ ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. జగనన్న సురక్ష పథకంలో పాల్గొనేందుకు మండలానికి వచ్చిన మంత్రి వనితకు మండల వైసిపి నాయకులు ఘన స్వాగతం పలకగా ఆయా గ్రామాల్లో జరిగిన కార్యక్రమాల్లో ఎంపిపి జొన్నకూటి పోసిరాజు, జెడ్‌పి వైస్ చైర్పర్సన్ పోసిన శ్రీలేఖ, సర్పంచ్ కొమ్మిరెడ్డి పరశురామారావు, తదితరులు పాల్గొన్నారు. కడియం కడియం మండలం దుళ్ల, మురమండ గ్రామాల్లో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ గ్రామాల్లో కార్యక్రమాలకు అధ్యక్షత వహించిన ఎంపిడిఒ రత్నకుమారి, తహశీల్దార్ సుజాతలు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి అవసరమైన అన్ని ధ్రువపత్రాలు ఉండాలనే సంకల్పంతో ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పాల్గొన్న మండల జెసిఎస్ కన్వీనర్ తాడాల చక్రవర్తి మాట్లాడుతూ పేదల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి అందరూ అండ గా నిలవాలన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ తోకల శ్రీనివాస్, ఎంపిటిసి సభ్యులు కట్టుంగ నాగరాజు, బసవ శంకరం, వార్డు సభ్యులు, కన్వీనర్లు పాల్గొన్నారు. చాగల్లు మల్లవరం మరియు యస్. ముప్పవరం గ్రామ సచివాలయాల్లో జగనన్న సురక్ష క్యాంపు నిర్వహించారు. మల్లవరం సచివాలయములో 843 మరియు యస్.ముప్పవరం లో 365 సర్టిఫికెట్స్ అధికారులు మరియు గ్రామ సర్పంచులు ప్రజా ప్రతినిధులు చేతుల మీదుగా లబ్దిదారులకి అందచేసారు. అధికారులు, ప్రజాప్రతనిధులు పాల్గొన్నారు. గోపాలపురం మండలంలోని గుడ్డిగూడెం, దొండపూడి గ్రామంలో జగనన్న సురక్ష కార్యక్రమం సర్పంచులు మడి చర్ల ప్రసాద్, మల్లిపూడి అచ్చిబాబు ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎంఎల్‌ఎ తలారి వెంకట్రావు విచ్చేసి మాట్లాడారు. నియోజకవర్గంలో రూ.300 కోట్లు పెట్టి రోడ్లు అభివృద్ధి చేస్తామని అన్నారు. మిగిలి ఉన్న రోడ్లను కూడా త్వరలో పూర్తి చేస్తామని అన్నారు. రెండు గ్రామాలకు సంబంధించి 1217 సర్టిఫికెట్లను అందించారు. రెండు గ్రామాలలో ప్రజా సమస్యలు ఎంఎల్‌ఎ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు ఆర్‌డిఒ మల్లి బాబు, రాష్ట్ర అత్తిరాస కార్పొరేషన్ ఛైర్మన్ ఇళ్ల భాస్కరరావు, ఎఎంసి ఛైర్మన్ జనార్దన్‌రావు, ఎంపిపి ఉండవల్లి సత్యనారాయణ, మండల స్పెషల్ ఆఫీసర్ సత్య గోవింద్, జెడ్‌పిటిసి సభ్యురాలు కె.లలిత, ఎంపిడిఒ ఆర్.శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. గోకవరం మండలంలోని కామరాజుపేటలో జగననన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎంఎల్‌ఎ జ్యోతుల చంటిబాబు పాల్గొన్నారు.










