May 01,2023 23:46

ప్రజాశక్తి పెరవలి మండలంలోని ఉసులుమర్రు, తీపర్రు, ఖండవల్లి, అజ్జరం గ్రామాల్లో దళితులకు శ్మశాన భూమి లేకపోగా కొన్నిచోట్ల ఉన్న శ్మశాన భూములను కబ్జాకు గురవుతున్నాయని బిఎస్‌పి ఆధ్వర్యాన సోమవారం ర్యాలీ చేపట్టారు. తహశీల్దారు టి.రాజేశ్వర్‌కు వినతిపత్రం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఉసులుమర్రులో దళితులకు శ్మశాన భూమి లేకపోవడంతో గోదావరి వరదల సమయంలో మతదేహాలను ఖననం చేయటానికి ఇబ్బందులు చవి చూస్తున్నామన్నారు. తీపర్రులో శ్మశానం లేక గోదావరి ఏటుగట్టును ఆనుకుని ఖననం చేస్తున్నామన్నారు. వరదల సమయంలో అనేక ఇబ్బందులు పడుతున్నట్టు చెప్పారు. అజ్జరం గ్రామంలో శ్మశాన భూమి లేకపోవడంతో రోడ్డు ప్రక్కన ఉన్న కొద్దిపాటి భూమిలో అంత్యక్రియలు చేయాల్సిన దుస్థితి నెలకొందన్నారు. అధికారులు తగిన చర్యలు తీసుకుని సమస్యలను పరిష్కరించాలన్నారు.