Jan 31,2023 23:12

స్వాగతం పలుకుతున్న నాయకుల

సమరయాత్రకు ఘన స్వాగతం
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం యువజన, విద్యార్థి సంఘాలు చేపట్టిన సమరయాత్ర 2.0కు రాజమహేంద్రవరంలో ఘన స్వాగతం దక్కింది. మంగళవారం రాత్రి 8గంటలకు ఈ యాత్ర రాజమహేంద్రవరం చేరుకుంది. ఏలూరు, భీమవరం, ధవళేశ్వరం మీదుగా కోటిపల్లి బస్టాండ్‌ వద్దకు చేరకుంది. ఈ యాత్రకు పలు విద్యార్థి, యువజన, ప్రజా సంఘాలు, వామపక్షాల నాయకులు, అభ్యుదయ వాదులు ఘన స్వాగతం పలికారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఎ.అశోక్‌, డివైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు వై.రాములతో కూడిన 17 మంది సభ్యుల బృందం యాత్రలో ఉంది. యాత్రకు స్వాగతం పలికిన వారిలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శలు వి.రాంబాబు, ఎన్‌.రాజా, ఎఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి సునీల్‌, పిడిఎస్‌యు జిల్లా కార్యదర్శి కిరణ్‌, ఆప్‌ కన్వీనర్‌ అత్తిలి రాజు, ఎన్‌ఎస్‌యుఐ నగర కార్యదర్శి తారకేశ్‌, సిపిఐ నగర కార్యదర్శి కొండలరావు, సిపిఎం నగర కార్యదర్శి బి.పవన్‌ ఉన్నారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి ఎన్‌.రాజా మాట్లాడుతూ యువజన, విద్యార్థి సంఘాల సమరయాత్ర సందర్భంగా బుధవారం ఎస్‌కెవిటి డిగ్రీ కళాశాలలో ఉదయం 10 గంటలకు బహిరంగ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. యువజన, విద్యార్థి సంఘాల నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.