ప్రజాశక్తి-గోపాలపురం
సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంగా మానవత పనిచేస్తుందని మానవత జిల్లా విద్యా కమిటీ శాశ్వత చైర్మన్ ఆలపాటి నాగేశ్వర రావు, మానవత జిల్లా రక్త నిధి డైరెక్టర్ జోడాల వెంకటేశ్వరరావు అన్నారు. ఆదివారం గోపాలపురం శార్వాణి రెసిడెన్షియల్ స్కూల్లోో మానవత మండల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. నూతన కార్యవర్గంలో మండల అధ్యక్షులుగా ముప్పన కపా వరప్రసాద్ రెడ్డి, కార్యదర్శి ముప్పిడి సందీప్‌రెడ్డి, ట్రెజరర్ గెడ జోగేంద్ర ప్రసాద్, ఉపాధ్యక్షులు పప్పు సత్యకష్ణారెడ్డి, జాయింట్ సెక్రెటరీ ఆకుల నవీన్‌రాజ్, ఇసిలు కుక్కల కీర్తి కుమార్, రాపాక ఫణి కుమార్, జుత్తిగ వెంకట్, కాకర్ల హరి రామ కష్ణ నూతనంగా నియమించి వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. వారు మాట్లాడుతూ సభ్యుల సంఖ్య పెంచడానికి కృషి చేయాలన్నారు. ప్రతి ఒక్క సభ్యుడు 50 సభ్యత్వాలు చేయాలి అని లక్ష్యం పెట్టుకొని తదనుగుణంగా సభ్యుల సంఖ్య ను పెంచాల్సిన భాధ్యత మీ అందరి పై ఉంది అని అన్నారు .సభ్యుల సంఖ్య పెంచేందుకు తాళ్లపూడి యూనిట్ మీకు సహాయ సహకారములు అందిస్తుంది అని అన్నారు. సభ్యురాలు ముప్పిడి నాగమణి మానవత కు ప్రతి నెల రూ.1000 అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపిపి ఉండవల్లి సత్యనారాయణ, సొసైటీ అధ్యక్షులు కూసం రామ్మోహన్ రెడ్డి, రీజినల్ కన్వీనర్ వాసుబోయిన చంద్రయ్య, జొన్న గడ్డల రాంబాబు, తాళ్లపూడి యూనిట్ అధ్యక్షులు సుబ్బారావు,సనపాల రాజశేఖర్,జిల్లా సభ్యులు సత్యనారాయణ, ఎస్కే ఖాదర్ వలీ, మండల మానవత సభ్యులు తదితరులు పాల్గొన్నారు.










