May 21,2023 22:45

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మే 24 పర్యటన విజయవంతం చేయడంలో సమన్వయంతో పని చేయాలని రాష్ట్ర హోమ్‌ శాఖ మంత్రి డాక్టర్‌ తానేటి వనిత పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత, ఇతర అధికారులతో కలిసి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను మంత్రి వనితి పరిశీలించారు. సభాస్థలం, అక్కడ ఏర్పాటు చేస్తున్న గ్యాలరీలను పరిశీలించారు. వేసవి దష్ట్యా తగినంత తాగునీరు ఏర్పాటు చెయ్యాలని, సుమారు 2.1 కిలోమీటర్ల మేర రోడ్‌ షో లో ప్రజలకు అభివాదం చేస్తూ కొవ్వూరు పట్టణంలో సిఎం పర్యటన చేయనున్న దష్ట్యా అత్యంత జాగ్రతలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి తొలిసారిగా కొవ్వూరు నియోజకవర్గం రానున్న దష్ట్యా పెద్ద ఎత్తున ప్రజలు, స్థానిక నాయకులు తరలి వస్తారని అందుకు అనుగుణంగా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో వివిధ కాలేజీలకు చెందిన విద్యార్థులు ఎక్కువగా పాల్గొనే అవకాశం ఉందని ఆమేరకు తగిన ముందస్తు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు అధికారులు వివరించారు. కలెక్టర్‌ కె.మాధవీలత మాట్లా డుతూ, ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. వివిధ శాఖల అధికారులకు సంబంధించి విధులను కేటా యించినట్లు పేర్కొన్నారు. ఎండల తీవ్రత దష్ట్యా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచనలు జారీ చేశామన్నారు. రోడ్‌ షో మేరకు బ్యారికేడ్లు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలకు పార్కింగ్‌ కోసం ఆయా మార్గాలలో ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. రహదారి పొడవునా ఎక్కడా ఎటువంటి బ్లాక్‌ హోల్స్‌ లేకుండా చూడాలని, రోడ్‌కు ఇరువైపులా బ్యారికేట్స్‌ ఏర్పాటు చెయ్యాలని సూచించారు. మెడికల్‌ క్యాంపులు రోడ్‌ షో, సభా ప్రాంగణం వద్ద ఏర్పాటు చెయ్యాలని, అంబులెన్స్‌ సేవలు కూడా అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో భాగంగా హెలిప్యాడ్‌ నుంచి సత్యవతి నగర్‌లోని స్థభాస్థలి వరకు రోడ్‌ షో మార్గంలో ఉన్న రూట్‌లో హోమ్‌ మంత్రి కాన్వారు ద్వారా మంత్రి, కలెక్టర్‌, ఇతర అధికారులు ట్రైల్‌ రన్‌ నిర్వహించారు. ఈ సందర్శనలో జాయింట్‌ కలెక్టర్‌ ఎన్‌.తేజ్‌ భరత్‌, ఆర్‌ఎంసి మునిసిపల్‌ కమిషనర్‌ కె.దినేష్‌ కుమార్‌, ఆర్‌డిఒ ఎస్‌.మల్లిబాబు, పోలీసు అధికారులు, స్థానిక అధికారులు, ప్రజా ప్రతినిధులు, పాల్గొన్నారు.