May 22,2023 23:20

ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్‌ మాధవీలత, ఎస్‌పి సుధృర్‌కమార్‌రెడ్డి

సిఎం పర్యటనా ఏర్పాట్ల పరిశీలన
ప్రజాశక్తి - కొవ్వూరు రూరల్‌
కొవ్వూరులో 24న సిఎం జగన్‌ పర్యటన నేపథ్యంలో ముందస్తు భద్రతా ఏర్పాట్లను పరిశీలించామని కలెక్టర్‌ మాధవీలత, ఎస్‌పి సుధీర్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి పర్య టన ఏర్పాట్ల రూట్‌ మ్యాప్‌ను పరిశీలించారు. హెలీప్యాడ్‌, రోడ్‌ షో మార్గం, సభాస్థలి వరకు మొత్తం రూట్‌ను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం సభా ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్న గ్యాలరీలను పరిశీలించారు. రోడ్‌ షో దృష్ట్యా అత్యంత భద్రతా ఏర్పాట్లతో పాటు తగిన జాగ్రతలు తీసుకోవాలని మాధవీలత సూచించారు. ఎండల తీవ్రత దృష్ట్యా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బారికేడ్ల ఏర్పాటు, వాహనాల పార్కింగ్‌లపై ఆరా తీశారు. రహదారి పొడవునా ఎక్కడా బ్లాక్‌ హోల్స్‌ లేకుండా చూడాలని, రోడ్డుకిరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. అంబులెన్స్‌ సేవలు కూడా అందుబాటులో ఉంచాలన్నారు. పెద్ద ఎత్తున ప్రజలు వచ్చే అవకాశం ఉన్నందున తగిన బందోబస్తు ఏర్పాటు చేస్తామని ఎస్‌పి తెలిపారు. ఈ సందర్భంగా ట్రైల్‌రన్‌ నిర్వహించారు. వారి వెంట జెసి ఎన్‌.తేజ్‌భరత్‌, ఆర్‌ఎంసి కమిషనర్‌ కె.దినేష్‌కుమార్‌, మున్సిపల్‌ చైర్మన భావన రత్నకుమారి, అడిషనల్‌ ఎస్‌పి పంకజ్‌కుమార్‌ మీనా, ఆర్‌డిఒలు, వివిధ శాఖల తదితరులున్నారు.