Aug 27,2023 00:16

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం రూరల్‌
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఈ నెల 30న నిడదవోలు పట్టణంలో నిర్వహించే 'వైఎస్‌ఆర్‌ నేస్తం'' రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో పాల్గొననున్న నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లను పరిశీలించినట్లు జాయింట్‌ కలెక్టర్‌ ఎన్‌. తేజ్‌ భరత్‌, రాజమహేంద్రవరం కమిషనర్‌ కె. దినేష్‌ కుమార్‌ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం ఆగస్ట్‌ 30న సిఎం జగన్‌ జిల్లా పర్యటన నేపధ్యంలో నిడదవోలు లో ముందస్తు ఏర్పాట్లను జాయింట్‌ కలెక్టర్‌ ఎన్‌.తేజ్‌ భరత్‌, మునిసిపల్‌ కమిషనర్‌ కె.దినేష్‌ కుమార్‌, ఎంఎల్‌ఎ జి.శ్రీనివాస నాయుడు ఇతర అధికారులు పరిశీలించారు. ఈ సందర్బంగా జాయింట్‌ కలెక్టరు ఎన్‌.తేజ్‌భరత్‌ మాట్లాడుతూ సిఎం పర్యటన నిమిత్తం హెలిప్యాడ్‌ నుంచి సభా వేదిక వరకు రోడ్‌ షో నిర్వహిస్తున్న దష్ట్యా బ్యారికెడ్లు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలకు పార్కింగ్‌ కోసం ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. వర్ష సూచనలు నేపథ్యంలో పర్యటించి అధికారులకు సూచనలు చేసినట్లు తెలిపారు. మునిసిపల్‌ కమిషనర్‌ కె. దినేష్‌ కుమార్‌ మాట్లాడుతూ, సభా వేదిక, వివిఐపి గ్యాలరీ, ఇతర గ్యాలరీల కు చెంది సూచనలు చేసినట్లు తెలిపారు. నిడదవోలు ఎంఎల్‌ఎ శ్రీనివాస నాయుడు సిఎం జగన్‌ నిడదవోలు పర్యటన లో రాష్ట్ర స్థాయి వైయస్‌ఆర్‌ కాపు నేస్తం కార్యక్రమం ద్వారా లబ్ధిదారుల ఖాతాకు నేరుగా నగదు జమ చేసే కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు ఆర్‌డిఒలు ఎస్‌.మల్లిబాబు, ఎస్‌ఇ పిఆర్‌ ఎబివి.ప్రసాద్‌, పీడీ డ్వామా పి.జగదాంబ, ఎస్‌ఇ ఆర్‌డబ్ల్యూఎస్‌ డి.బాల శంకర రావు, తహశీల్దార్‌, ఎంపిడిఒ, నిడదవోలు మునిసిపల్‌ కమిషనర్‌, ఇతర జిల్లా అధికారులు స్థానిక నాయకులు పాల్గొన్నారు.