Mar 01,2023 22:15

సిఎం జగన్‌ను డయానా కృతజ్ఞతలు

ప్రజాశక్తి-నిడదవోలు అరుదైన స్పైనల్‌ మస్క్యులర్‌ వ్యాధితో బాధ పడుతున్న నిడదవోలు శెట్టిపేటకు చెందిన బాలిక డయానా తల్లిదండ్రులు సిఎం వైఎస్‌.జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. గతంలో సిఎం వైఎస్‌.జగన్‌ రాజమహేంద్రవరం వచ్చిన సందర్భంగా తగిన సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో తక్షణం స్పందించి మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు రూ.లక్ష సాయంతో పాటు నెలకూ రూ. 10 వేల పెన్షన్‌, వారి కుటుంబంలో అవుట్‌ సోర్సింగ్‌ కింద డేటా ఎంట్రీ ఆపరేటర్‌ ఉద్యోగం ఇచ్చారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో తగిన వైద్య సేవలు అందించేలా చొరవ తీసుకున్నట్టు కలెక్టర్‌ మాధవీలత పేర్కొన్నారు. బుధవారం నిడదవోలు వచ్చిన ముఖ్యమంత్రి జగన్‌ను డయానా తల్లి సూర్యకుమారి కలిసి ధన్యవాదాలు తెలిపారు. న్యూఢిల్లీకి వెళ్లి రావడం కోసం విమాన ప్రయాణ ఖర్చులు, వసతి తదితర ఖర్చుల తగిన ఆర్థిక సహాయం చేయాలని సిఎం ఆదేశాలు ఇచ్చారని కలెక్టర్‌ మాóవీలత తెలిపారు.