జగన్‌కు చిత్రపటాన్ని బహూకరిస్తున్న గిరజాల బాబు
ప్రజాశక్తి - కడియం
తమ కుమార్తె వివాహానికి రావాలని వైసిపి రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు, ఆయన సతీమణి, రాజమహేంద్రవరం ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ చైర్మన్ గిరజాల రామకృష్ణతులసి ముఖ్యమంత్రి జగన్‌కు ఆహ్వానం పలికారు. శుక్రవారం తాడేపల్లి ముఖ్యమంత్రి కార్యాలయంలో ధాన్యపు గింజలతో తయారుచేసిన చిత్రపటాన్ని, శుభలేఖను జగన్‌కు అందించారు. 'రైతు ఆపద్బాంధవుడికి దాన్య చిత్ర జ్ఞాపిక' నినాదంతో తయారుచేసిన ఈ కళాకతిని చూసి జగన్ చాలా అబ్బురపడ్డారని గిరజాల తెలిపారు. తప్పకుండా వివాహానికి విచ్చేసి వధూవరులను ఆశీర్వదిస్తానని ముఖ్యమంత్రి చెప్పినట్లు గిరజాల పేర్కొన్నారు. బాబు వెంట సోదరుడు వెంకన్నబాబు తదితరులున్నారు.










