Jun 03,2023 23:38

సర్వే బృందంతో సర్పంచ్‌ శేఖర్‌బాబు, డిటి కృష్ణ

సగ్గొండలో డ్రోన్‌ సర్వే ప్రారంభం
ప్రజాశక్తి - గోపాలపురం
భూ వివాదాలు పరిష్కారం కోసం, అక్రమాలకు తావు లేకుండా చేసేందుకు జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్ష పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని సగ్గొండ సర్పంచ్‌ యండపల్లి శేఖర్‌బాబు అన్నారు. సగ్గొండ పంచాయతీ పరిధిలో సగ్గొండ, గంగోలు రెవిన్యూ గ్రామాల్లో శనివారం డ్రోన్‌ సర్వేను డిప్యూటీ తహశీల్దార్‌ కృష్ణతో కలిసి శేఖర్‌బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోపవరంలో ఇంటి స్థలాలు, ఇళ్లను, పొలాలను డ్రోన్‌ ద్వారా సర్వే చేస్తారన్నారు. డిజిటల్‌ సర్వే ద్వారా శాశ్వత హక్కు పత్రాలు అందిస్తారన్నారు. పంచాయతీ కార్యదర్శి అనురాధ, గ్రామ సర్వేయర్‌ వెంకటేష్‌, విఆర్‌ఒ కె.రమేష్‌, గ్రామ పెద్దలు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.