సచివాలయ భవనాన్ని ప్రారంభిస్తున్న ఎంఎల్‌ఎ వెంకట్రావు
ప్రజాశక్తి -దేవరపల్లి
దేవరపల్లి మండలం రామన్నపాలెంలో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనాన్ని ఆదివారం గోపాలపురం ఎంఎల్‌ఎ తలారి వెంకట్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ తలారి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ ప్రజలందరికీ అన్ని సేవలు, సంక్షేమ పథకాలు అందించే విధంగా పనిచేస్తున్నారన్నారు. గ్రామీణ ప్రజలకు అన్ని సేవలు అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి సచివాలయాలను ఏర్పాటు చేశారన్నారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి కెవికె.దుర్గారావు, ఎఎంసి చైర్మన్ జనార్థన్‌రావు, సర్పంచ్ బుల్లారావు, జడ్‌పిటిసి సభ్యులు స్వర్ణలత, తహశీల్దార్ ఎం.రామకృష్ణ, సచివాలయం సిబ్బంది, ప్రజా ప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు.










