Aug 11,2023 23:42

నిరసన తెలుపుతున్న విద్యుత్‌ ఉద్యోగులు

ప్రజాశక్తి - పెరవలి
పెరవలి సబ్‌ స్టేషన్‌ వద్ద ఎలక్ట్రికల్‌ ఎఇ డేవిడ్‌ నిచ్చల్‌ సమక్షంలో శుక్రవారం విద్యుత్‌ ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.వెంకటసుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్ర జెఎసి నాయకులు చీకటి ఒప్పందానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేస్తున్నామన్నారు. తమకు రావాల్సిన డిఎలు ఇప్పించాలన్నారు. రాత్రి, పగలు కష్టపడి పని చేస్తున్న కార్మికులు చనిపోయిన వారి కుటుంబాలకు కారుణ్య నియామకాలు చేయట్లేదన్నారు. ఉద్యోగస్తులకు ప్రమాదాలు జరిగితే వైద్యం చేయిచంఉకోవడానికి కూడా నానా ఇబ్బందులకు గురవుతున్నామనానరు. రాత్రి పగలు కష్టపడి పని చేస్తున్న తమకు రావాల్సిన డిఎ, పిఆర్‌సిలు తక్షణ ఇవ్వాలన్నారు 2022 ఏప్రిల్‌ నుంచి నిలిపేసిన పిఆర్‌సి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్మికులపై పని ఒత్తిడి తగదన్నారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిధిలో ఉన్న లైన్‌మెన్‌లు, విద్యుత్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు