Mar 01,2023 22:07

ప్రజాశక్తి-తాళ్లపూడి, గోపాలపురం విజయవాడ లయోలా కాలేజీలో రాష్ట్రస్థాయి సైన్సు ఫెయిర్‌లో మండలంలోని అన్నదేవరపేట అల్లూరి స్వర్ణ జెడ్‌పి పాఠశాల విద్యార్థి వి.చరణ సాయి ప్రథమ బహుమతి సాధించినట్టు హెచ్‌ఎం అర్జున్‌రావు తెలిపారు. సత్య సాయి గురుకుల పాఠశాలలో జరిగిన జిల్లా స్థాయి ప్రదర్శనలో మాథ్స్‌ మోడల్‌ ప్రాజెక్ట్‌ చేసి ప్రథమ స్థానం సాధించి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాడని, అక్కడ కూడా మొదటి స్థానం సాధించాడని ఆయన తెలిపారు. ఈ బాలునికి గైడ్‌గా లక్ష్మీ దీప హాజరయ్యారు. గోపాలపురం డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ గురుకుల పాఠశాల విద్యార్థినికి తతీయ స్థానం వచ్చినట్లు కళాశాల ప్రిన్సిపల్‌ టి.ఉమాదేవి తెలిపారు. రాష్ట్ర స్థాయిలో విద్య వైజ్ఞానిక ప్రదర్శనలో పదో తరగతి విద్యార్థిని కొడవటి వినూత్న తతీయ స్థానం సాధించినట్టు తెలిపారు.