ప్రజాశక్తి - ఉండ్రాజవరం
రానున్న కాలంలో సైకో పాలనకు చరమగీతం పాడాలని మాజీ ఎంఎల్‌ఎ బూరుగుపల్లి శేషారావు అన్నారు. ఆదివారం సూర్యారావుపాలెంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శేషారావు పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, నిత్యావసరాల ధరల పెరుగుదల అరికట్టాలంటే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టిడిపిని గెలిపించి చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలన్నారు. చంద్రబాబు యాత్రకు ప్రభుత్వం, పోలీసులు అడుగడుగునా అడ్డంకులు కల్పి స్తున్నారన్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని దిక్కరించడవే ునన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు సింహాద్రి రామకృష్ణ, జడ్‌పిటిసి మాజీ సభ్యులు సుబ్బారావు, ఉప సర్పంచ్ నందిన శ్రీనివాస్, పార్టీ నాయకులు వల్లేపల్లి రాజా, మద్దుకూరి శ్రీమన్నారాయణ, మెండే శ్రీనివాస్, చివటం ఎంపిటిసి సభ్యులు వేముల సత్యనారాయణ, ఆచంట సాయి, నల్ల ఇంద్రయ్య, మద్దుకూరి గుర్నాధం, వల్లేపల్లి రాంబాబు, ముళ్ళపూడి సుభాష్ బాబు, నిమ్మగడ్డ సత్యనారాయణ గ్రామ పార్టీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు.










