Sep 29,2023 23:26

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న ఎఎంఒ తదితరులు

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
విద్యార్థుల్లో శాస్త్రీయ భావనలు పెంపొందించేందుకు సైన్స్‌ కాంగ్రెస్‌ ఎంతో ఉపయుక్తమని జిల్లా ఎఎంఒ గౌరీ శంకర్‌ అన్నారు. స్థానిక ఎస్‌కెవిటి హై స్కూల్‌లో 31వ జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ డివిజన్‌ స్థాయి ఓరియంటేషన్‌ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని యాజమాన్యాల పాఠశాలల విద్యార్థులు ఇందులో పాలొనొచ్చని తెలిపారు. గతేడాది జిల్లా నుంచి మద్దూరు స్కూల్‌ విద్యార్థిని జాతీయ స్థాయికి ఎంపికైందని గుర్తు చేశారు. జిల్లా సైన్స్‌ కోఆర్డినేటర్‌ కె.సతీష్‌బాబు మాట్లాడుతూ బాల శాస్త్ర వేతలుగా ఎదిగేందుకు ఇది మంచి అవకాశమన్నారు. ప్రతి స్కూల్‌ నుంచి కనీసం 5 ప్రాజెక్ట్స్‌ తయారు చేసి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సతీష్‌బాబు తెలిపారు. 31వ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ గోడపత్రిక ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిఎంఒ శ్రీనివాస్‌, రిసోర్స్‌ పర్సన్లు బిఎల్‌విఎన్‌.ఆనంద్‌కుమార్‌, సుబ్బయ్య, జి.జ్యోతి, అకాడమిక్‌ కో-ఆర్డినేటర్‌ సుసత్య రేఖ, జిల్లా సైన్స్‌ ఆఫీసర్‌ జివిఎన్‌ఎస్‌.నెహ్రూ ఎన్‌జిసి కో-ఆర్డినేటర్‌ ఆంజనేయులు పాల్గొన్నారు.