Sep 12,2023 23:55

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి
జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో ఎటువంటి రాజీలు లేకుండా పని చేయాలని జిల్లా ఎస్‌పి పి.జగదీష్‌ ఆదేశించారు. జిల్లా ఎస్‌పిగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఆయన తొలిసారిగా జిల్లాలో నేరాలకు సంబంధించి సమీక్షా సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్‌ ఎస్‌పి (లా అండ్‌ ఆర్డర్‌) తూర్పు గోదావరి జిల్లా సమగ్ర స్వరూపం, స్థితి గతులు, రాజకీయ, భౌతిక స్వరూపం, నేరాలు వంటి అంశాలపై ఎస్‌పికి సమగ్రంగా వివరించారు. అనం తరం ఎస్‌పి జగదీష్‌ పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. పెండింగ్‌ ట్రయల్‌లో ఉన్న, అండర్‌ ఇన్వెస్టిగేషన్లో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తిచేసి, కన్వెక్షన్‌ రేట్‌ పెంచాలని ఆదేశించారు. లోక్‌ అదాలత్‌లో వీలైన కేసులను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. నాన్‌ బెయిలబుల్‌ వారెంట్లను ఎగ్జిక్యూట్‌ చేయాలని, వాటి సంఖ్యను తగ్గించాలని సూచించారు. ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు కేస్‌ ఇన్వెస్టి గషన్‌ను ప్రోపర్‌గా చేసి చార్జ్‌ షీట్‌ ఫైల్‌ చేయా లన్నారు. ఎటువంటి డివియేషన్‌ లేకుండా కేస్‌ ఇన్వెస్టిగేషన్‌ చేయాలన తెలిపారు. రాత్రివేళల్లో గస్తీ తిరిగే అధికారులంతా సమన్వయం చేసుకుని నగరంతోపాటు, నగర శివారు ప్రాంతాల్లో నేరాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. అలాగే నైట్‌ సర్వింగ్‌ బిట్స్‌ పెంచాలని ఆదేశించారు. రౌడీ షీటర్లు, బ్లేడ్‌ బ్యాచ్‌ మరియు పాత నేరస్తులపై ప్రత్యేకంగా నిఘా ఉంచాలన్నారు. గంజాయి, నాటు సారా, ఇతర మాదకద్రవ్యాల అమ్మకాలపై దృష్టి సారించాలన్నారు. ఫింగర్‌ ప్రింట్‌ డివైసెస్‌ మరియు బ్రీత్‌ అనలైజర్స్‌ లను ఉపయోగించాలని అన్నారు. ఈ సమీక్షా సమావేశంలో అడిషనల్‌ ఎస్‌పి (లా అండ్‌ ఆర్డర్‌) ఎం. రజినీ, అడిషనల్‌ ఎస్‌పి (క్రైమ్స్‌) జి. వెంకటేశ్వరరావు, డిఎస్‌పి ( ఎస్‌బి) డి. రామవరమ్మ, జోనల్‌ డిఎస్‌పిలు, పాల్గొన్నారు.