ప్రజాశక్తి-కడియం: కడియం నుండి దుళ్ల వరకూ 10 కిలోమీటర్లు , కడియం నుండి జేగురుపాడు వరకూ సుమారు 3 కిలోమీటర్ల రహదారులకు 40 లక్షల రూపాయల నిధులతో చేపట్టిన మరమత్తు పనులను రూరల్ వైసిపి కో ఆర్డినేటర్ చందన నాగేశ్వర్ ఆదివారం కడియం హైస్కూల్ వద్ద ప్రారంభించారు. ఈ సందర్బంగా చందన మాట్లాడుతూ మండలంలో పలు గ్రామాల్లో రోడ్లు పాడై, ప్రజలు ప్రమాదాలబారిన పడుతున్న విషయం తనదృష్టికి వచ్చిందన్నారు. రహదారుల సమస్యలు ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రులకు తెలియజేసి, ప్రజల ఇబ్బందులను తెలియపరచి , రహదారులు పునఃరుద్దరణ పనులకు ప్రయత్నిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్&బి డిఈఈ మధుసూదనరావు, సోషల్ మీడియా కో కన్వీనర్ శాకా సురేష్, ఆకుల సుధాకర్, ఆరేటి వెంకట్రావు, గుత్తుల వాసు, కే.బాలనాగేశ్వరరావు, రాజు, మణి, తులసీరామ్, మూర్తి తదితరులు పాల్గొన్నారు.










