May 12,2023 15:06

ప్రజాశక్తి-రాజానగరం : జాతీయ రహదారి దివాన్చెరువు పెట్రోల్ బంక్ ఎదురుగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడికి తీవ్ర గాయాలైనాయి. రాజానగరం నుంచి రాజమహేంద్రవరం వైపుకు మోటారు సైకిల్ పై ఐస్ క్రీమ్ లు పట్టుకుని వెలుతున్నడు. పెట్రోల్ బంక్ ఎదురుగా ముందు వెలుతున్న కారును వేగంగా ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో అతని తలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం 108లో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే యువకుడు దగ్గర సెల్ ఫోన్, ఐడెంటిటీ కార్డులు లేవు. ఇతని వివరాలు తెలిసిన వారు ఆసుపత్రికి సంప్రదించాలని కోరారు.