ప్రజాశక్తి - ఉండ్రాజవరం : విద్యార్థుల మనోవికాసానికి, శారీరక దృఢత్వానికి క్రీడలు ఎంతగానో తోడ్బడతాయన్నారు. తణుకు శ్రీ సత్యనారాయణ స్పిన్నింగ్ మిల్ నిర్వహణాధికారి బాలకృష్ణ. కార్పొరేట్ సామాజిక బాధ్యత పథకంలో భాగంగా ఉండ్రాజవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల కొరకు డైనింగ్ హాల్లో మినరల్ వాటర్ యూనిట్ ను స్పిన్నింగ్ మిల్ యాజమాన్యం తరఫున బహూకరించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు విశ్వప్రసాద్ శనివారం తెలిపారు. దీంతోపాటు పాఠశాల క్రీడా ప్రాంగణంలో ట్రాక్, కోర్ట్ ల కొరకు మట్టితో ఆధునీకరించి, పాఠశాలకు సహకారం అందించారన్నారు. గ్రామ సర్పంచ్ మెండే వెంకటరావు, పేరెంట్స్ కమిటీ చైర్మన్ సోంబాబు, చేతుల మీదుగా మినరల్ వాటర్ ప్లాంటును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్పిన్నింగ్ మిల్ అధికారులు ఉమా శంకర్, బాలకృష్ణ, ఇతర అధికారులు, ఉపాధ్యాయులు స్వామి, పుష్పవల్లి, తదితరులు పాల్గొన్నారు.










