ప్రజాశక్తి - ఉండ్రాజవరం : 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఈ ఓ పి ఆర్ డి ముత్యం వీరాస్వామి నాయుడు అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అద్యక్షరాలు పాలాటి యల్లారీశ్వరి, వైస్ ఎంపీపీ నరహరిశెట్టి సరోజ, మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యులు ఎస్ కే. షాజహాన్, ఎంపీటీసీ పసల బుల్లి సుబ్బారావు, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది, ఎన్.ఆర్ ఈ జీ ఈ ఎస్ సిబ్బంది, ఇంజనీరింగ్ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. మండలంలోని వివిధ గ్రామ సచివాలయాల్లో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ సేవ అవార్డు గ్రహీత ఎంపీడీవో ఎ. శ్రీనివాస్ మండల పరిషత్ సభ్యులు అభినందనలు తెలిపారు.










