Jun 01,2023 12:41

ప్రజాశక్తి-కడియం : రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ మాజీ డైరెక్టర్ , గ్రామ మాజీ సర్పంచ్ దివంగత కాగిత ధనుంజయ సేవలు చిరస్మరణీయమని దళిత నాయకులు పేర్కొన్నారు. ధనుంజయ 13వ వర్ధంతి సందర్భంగా వేమగిరి అoబేడ్కర్ పార్కులో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి  ఘన నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు పాస్టర్స్ ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ధనుంజయ కుమార్తె , మాజీ ఎంపీపీ సత్య భారతి, దళిత నాయకులు కాగిత రాయప్ప, కాగిత రాజు, గూడు రాజేంద్ర, పీతల అశోక్, తదితరులు మాట్లాడుతూ సీనియర్ కాంగ్రెస్ పార్టీ వాదిగా, వేమగిరి సర్పంచ్ గా ధనుంజయ ఎన్నో సేవలు చేశారని, ఆయన హయంలో దళిత వాడలు అభివృద్ధి చెందాయని, ఎందరో నిరుపేదలకు ఇళ్ళ పట్టాలు పంపిణీ చేయించారని, ఆయన అభివృద్ధి చిరస్పరనీయమని పేర్కొన్నారు.