ప్రజాశక్తి - పెరవలి
మండలంలోని ఖండవల్లి గ్రామ పరిధిలో ఉ్న రవళి స్పిన్నర్స్ విస్తరణ పనులకు సిఎం జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో రవళి స్పిన్నర్స్ విస్తరణ పనులతోపాటు, కోరుకొండ మండలం కనుపూరు గ్రామంలో మిల్లెట్స్ ప్రాసెస్ యూనిట్స్ పనులకు సిఎం బుధవారం శంఖుస్థాపన చేశారు. స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రులు సిహెచ్. శ్రీనివాస్ వేణుగోపాల్ కష్ణ, తానేటి వనిత, కారుమూరి నాగేశ్వర రావు, జిల్లా కలెక్టర్ కె. మాధవీలత, ఎంఎల్‌సి వంకా రవీంద్ర, ఎంఎల్‌ఎ జి. శ్రీనివాస నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత మాట్లాడుతూ జిల్లాలో సంక్షేమ పథకాలతోపాటు అభివద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో తోడ్పాటు ఇవ్వడం జరుగుతోందని అన్నారు. జిల్లాకు చెందిన మూడు పరిశ్రమలకి సిఎం శ్రీకారం చుట్టారని, వాటిలో రూ.150 కోట్లతో ఖండవల్లిలో రవళి స్పిన్నింగ్ మిల్లు విస్తరణ శంఖుస్థాపన, కోరుకొండ మండలం కనుపూరులో రూ.4.5 కోట్ల తో స్మాల్ స్కేల్ ఇండిస్టీస్‌లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కు శంఖుస్థాపన చెయ్యగా, 3 ఎఫ్ ఆయిల్ పామ్‌తో రూ.250 కోట్లతో అవగాహన ఒప్పద్దం చేసుకోవడం జరిగిందన్నారు. జిల్లాలో పరిశ్రమల స్థాపనకు పెద్దఎత్తున ప్రోత్సహం ఇవ్వడం జరుగుతుందని, జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అనుకూలంగా ఉన్నట్లు పేర్కొన్నారు. జిల్లా యంత్రాంగం తరపున అన్ని సహాయ సహకారాలు ఇవ్వడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జెసి ఎన్. తేజ్ భరత్, సహాయ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి, రవళి పరిశ్రమ జాయింట్ ఎండి వంక రాజకుమారి, డైరెక్టర్ వంక రఘువీర్, ఆర్‌డిఒ ఎస్ మల్లి బాబు, జిల్లా పరిశ్రమల అధికారి బి. వేంకటేశ్వర రావు, జిల్లా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అధికారి ఎ. స్వాతి, తహశీల్దార్ టి.రాజరాజేశ్వరి, ఎంపిపి కార్చెర్ల సీతారామ ప్రసాద్, సర్పంచ్‌లు నాగరాజు, కేతా త్రిమూర్తులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.










