Mar 13,2023 16:59

మృతుడు రవ్వ నాగరాజు

ప్రజాశక్తి-నల్లజర్ల
మండలంలోని అచ్చన్నపాలెం 16వ నెంబరు జాతీయ రహదారిపై, ఫ్లైఓవర్‌ వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు దేవరపల్లి మండలం సూర్యనారాయణపురం(సంజీవపురం) గ్రామానికి చెందిన రవ్వ నాగరాజు నల్లజర్లలోని అపోలో ఫార్మసీలో ఉద్యోగం చేస్తున్నాడు. సోమవారం స్కూటర్‌పై అనంతపల్లి వైపు నుంచి నర్లజర్ల వస్తున్నాడు. ఫ్లైఓవర్‌ వద్దకు వచ్చేసరికి బండి అదుపుతప్పి డివైడర్‌, ఆ పక్కనే ఉన్న సిమెంట్‌ స్తంభాన్ని ఢకొీట్టాడు. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయం కావడంతో నాగరాజు(27) అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మతదేహాన్ని పోస్టుమార్ట నిమిత్తం తాడేపల్లిగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.