ప్రజాశక్తి- గోకవరం : మండలంలోని అచ్చుతాపురం గ్రామంలో భారత మాజీ ప్రధాని దివంగత నేత రాజీవ్ గాంధీ 32వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా గోకవరం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెం కన్వీనర్ కొండ శ్రీను మాట్లాడుతూ భారత దేశానిక రాజీవ్ గాంధీ చేసిన సేవలను కొనియాడారు. భారతదేశంలో గ్రామ స్వరాజ్యం రావాలని గ్రామంలో పరిపాలన సాగాలని గ్రామ పంచాయతీ వ్యవస్థను ఎంపీటీసీ జడ్పిటిసి వ్యవస్థలను తీసుకొచ్చిన ఘనత రాజీవ్ గాంధీదని తెలిపారు. ఆ మహనీయూనిని కొనియడారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గుర్రాల రత్నాజీ మాజీ ఎంపిటిసి మాచర్ల పప్పారావు, అధ్యక్షులు బొల్లం బాబు రాజు, రాష్ట్ర బీసీ సెల్ కన్వీనర్ కోలపర్తి వీర వెంకటరావు, వేగుపాటి మహేష్ బాబు, గ్రామ పెద్దలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.










